కొడవలూరు: ఎమ్మెల్యే చొరవతో సమస్యకు పరిష్కారం

79చూసినవారు
కొడవలూరు: ఎమ్మెల్యే చొరవతో సమస్యకు పరిష్కారం
కొడవలూరు మండలం పాతవంగళ్ళు పంచాయతి పరిధిలోని వడ్డిపాలెం ఊరు మొత్తానికి తాగునీరు అందించే బావిలో వేసవి సందర్భంగా నీళ్లు అడుగంటి పోయాయి. బావిలో పూడిక తీయిస్తే తప్ప ఆ గ్రామానికి తాగునీళ్లు అందని పరిస్థితి. గ్రామస్తులంతా ఏకమై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి తమ పరిస్థితి వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రశాంతమ్మ ఆదేశాలతో రంగంలోనికి దిగిన అధికారులు పూడిక మంగళవారం తీయించారు.

సంబంధిత పోస్ట్