కొడవలూరు గ్రంధాలయానికి ఇన్నోవేషన్ క్విజ్ మాస్టర్ యంత్రపాటి సుబ్బారావు మంగళవారం విచ్చేశారు. వేసవి విజ్ఞాన శిబిరంలో పుస్తకాలు చదివి, బొమ్మలు వేసి జ్ఞానాన్ని పెంచుకుంటున్న విద్యార్థులకు ఆయన వినూత్న రీతిలో ప్రశ్నలు వేశారు. ఎక్కువ సమాధానాలు చెప్పిన షేక్. ఆసిఫా బేగం అనే విద్యార్థినికి ఇన్నోవేటివ్ క్విజ్ సర్టిఫికేట్ అందజేశారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు గ్రంధాలయాలకు వచ్చి జ్ఞానం పెంచుకోవాలన్నారు.