నెల్లూరు నగరం నుంచి కోవూరు పట్టణానికి ఎల్ హెచ్ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిట రింగ్ సిస్టం) విస్తరించడం జరిగిందని, దీని సహాయంతో చోరీలను నివారించవచ్చని కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. కోవూరు పోలీస్ స్టేషన్లో ఆయన సోమవారం మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఎల్ హెచ్ఎంఎస్ యాప్ తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా గుర్తుతెలియని వారు కన్పిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు.