కోవూరు నియోజకవర్గం రైతు సమస్యలపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నెల్లూరు కలెక్టరేట్ లో గురువారం జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో సమావేశం అయ్యారు. ప్రభుత్వం వరి రైతులకు ప్రకటించిన గిట్టుబాటు ధర కల్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. రైతు సేవా కేంద్రాలలో ద్వారా జరిపే ధాన్యం కొనుగోళ్లులో కీలక పాత్ర పోషించే సహకార సొసైటీ సిబ్బందికి చెల్లించాల్సిన కమీషన్ల తాలూకు బకాయిలు చెల్లించాలని జేసీని కోరారు.