ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనారోగ్య పీడితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడుకి వేమిరెడ్డి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లోని నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి చేశారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 7 విడతలుగా 40 మంది అనారోగ్య పీడితులకు 85 లక్షల 65 వేల 387 రూపాయలు మంజూరయ్యాయన్నారు.