కోవూరు నగరంలో ఉదయం 9 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా అయ్యే ప్రధాన విద్యుత్తు లైన్ 33/ 11 తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది విద్యుత్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మత్తు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కోవూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.