బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి పంచాయతీలో రూ.10 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధికే పల్లె పండుగ చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.