కోవూరు మండలంలో ఆదివారం సాయంత్రం వీసిన భారీ ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించి అర్ధరాత్రి కల్లా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో పాటు విద్యుత్ తీగలపై ఫ్లెక్సీలు చుట్టుకొని పోయాయి. విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేసి ఎట్టకేలకు మండలంలో విద్యుత్ ను పునరుద్ధరించారు.