నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో స్థానిక గ్రంథాలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీట్ ద హీట్ నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అలాగే గ్రంథాలయం ప్రాంతంలో మొక్కలు నాటి నీరు పోశారు. ఎండాకాలం సందర్భంగా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని లైబ్రేరియన్ సురేంద్ర తెలిపారు. ఎక్కువగా నీరు తాగాలన్నారు.