స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు దృఢంగా అడుగులు వేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు. బుచ్చి నుంచి ఆమె సోమవారం నియోజకవర్గ స్థాయి వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు, కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. పేదల అభివృద్ధే సీఎం ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.