పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు విపిఆర్ నివాసంలో 39 మందికి 34 లక్షల విలువచేసే సిఎంఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి పెద్ద పేట వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీ రెడ్డి, కోవూరు టిడిపి మండలాధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.