కోవూరు పట్టణంలోని గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతులలో భాగంగా గురువారం విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, కథలు చెప్పడం తదితర వాటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేపట్టి విద్యార్థులకు జ్ఞానాన్ని పెంచే విధంగా చేస్తున్నట్లు గ్రంథాలయ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ సురేంద్ర రెడ్డి పాల్గొన్నారు