కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోవూరు గ్రామాభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించిదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె కోవూరు గ్రామానికి విచ్చేసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రూ. 22 లక్షలతో నిర్మించిన కైలాస భూమి రహదారిని ఆమె ప్రారంభించారు.