కోవూరులోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో కోవూరు టిడిపి నాయకులు చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడారు. 2019-2024 మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 18. 04 లక్షల గృహాలు మంజూరు చేయగా, గత వైసిపి ప్రభుత్వం కేవలం 5. 87 లక్షల గృహాలు మాత్రమే పూర్తి చేశారు. 12. 20 లక్షల గృహాలు అసంపూర్తిగా విడిచిపెట్టారన్నారు. గృహ నిర్మాణం కొరకు కేంద్ర ఇచ్చిన నిధులను కూడా దారి మల్లించిందన్నారు.