ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన మంగళవారం జరిగింది. కొడవలూరు మండలం నాయుడుపాలెంకి చెందిన మదన్, కిషోర్ లు బైక్ పై నెల్లూరుకు వెళుతుండగా కోవూరు బైపాస్ లో ఆకాశ వంతెనపై ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.