కోవూరు మండలం వేగూరు అంగన్వాడీ కేంద్రంలో గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. మూడేళ్లు నిండిన 15 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు చేయిస్తూ పిల్లలు విద్యారంభం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంచి పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్వైజర్ ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.