కోవూరులో మినీ ఆటోనగర్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

63చూసినవారు
కోవూరులో మినీ ఆటోనగర్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
కోవూరు మండల పరిధిలోని ఇనమడుగు సెంటర్ సమీపంలో మినీ ఆటోనగర్ కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మిని ఆటోనగర్ కార్మిక సోదరులకు ప్రభుత్వం తరుపున ఏ అవసరమొచ్చినా అండగా వుంటానని పేర్కొన్నారు. లక్కీ డిప్ ద్వారా 65 మంది మెకానిక్, లేత్, వెల్డింగ్ తదితర ఆటో బేసెడ్ వృత్తులు చేసుకునే కార్మికులకు షాపులు కేటాయించారు.

సంబంధిత పోస్ట్