ప్రజల సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు మండలం స్టోబిడి కాలనీలో త్రాగునీటి పైపు పగిలి పక్కనే ఉన్న చెత్తాచెదారం నీటిలో చేరి కలుషితమయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే ప్రశాంతి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె మున్సిపల్ అధికారులను ఆదేశించి తక్షణమే మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాలతో శనివారం మరమత్తు పనులు ప్రారంభించారు.