వైద్య సేవలకు సంబంధించి నిర్లక్ష్యాన్ని సహించనని డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హెచ్చరించారు. బుచ్చిరెడ్డి పాళెం కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో గురువారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో వివిధ వార్డులలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.