విడవలూరులో అంబేద్కర్ జయంతి సందర్భంగా బాణాసంచా కాలుస్తూ ప్రమాదవశాత్తు గాయపడి నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులు వారి కుటుంబ సభ్యులను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కోడూరు కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.