నాగరికత ఎంత పెరిగినా నాగలి లేనిదే పని జరగదని, రైతు లేనిదే పూట గడవదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండలం చౌకిచర్ల గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎడ్ల బండిపై ఊరేగించుకుంటూ గ్రామానికి తీసుకువచ్చారు. అనంతరం వ్యవసాయ పనిముట్లకు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.