తల్లికి వందనం విద్యార్థులకు వరమని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గత పాలనలో పాఠశాల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి. నేడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. శనివారం ఈ మేరకు నెల్లూరులోని విపిఆర్ నివాసంలో తల్లికి వందనం పొందిన లబ్ధిదారులు, వారి పిల్లలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.