కోవూరు మండలం పడుగుపాడులో మూడో అంతస్తులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిన అరులు(27) అనే కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. నెల్లూరులోని అల్లీపురంకు చెందిన ఆయన భవన నిర్మాణ పనులు చేస్తూ ఉంటాడు. కళ్లు తిరిగి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడికి భార్య షర్మిల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.