కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఉదయం కోవూరు పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని సాయిబాబా మందిరం వీధిలో అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి ఇంటికి తిరుగుతూ పెన్షన్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది కుసుమలత, బూత్ కన్వీనర్ నాటక రాణి వెంకట్, టిడిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.