అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు, బీరంగుంట, రైస్ మిల్ కాలనీ, ఇసుకపల్లి, మందిరం, తుఫాన్ నగర్, ఇందుపూరు తదితర ప్రాంతాల్లో శనివారం ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఎండ వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం ఇచ్చింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.