నెల్లూరు: కామాక్షితాయిని దర్శించుకున్న రామానంద భారతి

74చూసినవారు
నెల్లూరు: కామాక్షితాయిని దర్శించుకున్న రామానంద భారతి
నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ కామాక్షితాయి ఆలయాన్ని విశాఖపట్నం మౌనానంద తపోవనం శ్రీసౌభాగ్య భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు రామానంద భారతి స్వామిజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వేద పండితులు అధికారులు ఆయనకు ఆలయ లాంచనాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్