విడవలూరు మండలంలోని రామతీర్థంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర సమేత శ్రీ కామాక్షితాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ అంశాలకు గురువారం నిర్వహించిన వేలం పాటలలో ఆలయానికి భారీ రాబడి వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ టెంకాయలు పూజా సామాగ్రి విక్రయానికి గత సంవత్సరం 1, 60, 000 రాగా ఈ సంవత్సరం 1, 67, 000 వచ్చినట్లు తెలిపారు.