శ్రీచాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

84చూసినవారు
శ్రీచాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. మంగళవారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కళ్యాణ్ రెడ్డి, ఆలయ నిర్వాహకులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్