బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్ పర్సన్ సుప్రజా మురళి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు చాక్లెట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.