పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం "షైనింగ్ స్టార్స్" అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులకు విడవలూరు మండలం వావిళ్ళ జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. సోమవారం నెల్లూరులోని కస్తూరి దేవి గార్డెన్స్ లో ఇన్ ఛార్జ్ కలెక్టర్ కార్తీక్, ఎంపీ వేమిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులు విష్ణు ప్రియ, లిఖిత అవార్డులు, 20, 000 నగదు, మెడల్స్ అందుకున్నారు.