వెంకటాచలం మండలం సర్వేపల్లి సమీపంలోని మల్లుగుంట సంఘం వద్ద శుక్రవారం ఉదయం బైక్‌ను ఆటో ఢీకొని బోల్తా పడింది. మలుపు వద్ద బైక్ ఒక్కసారిగా ఎదురుగా రాగా ఆటో బైక్‌ను ఢీకొట్టి చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 35 ఏళ్ల మహిళకు తీవ్రగాయాలు కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.