విడవలూరు: 12 ఏళ్ల బాలుడు మృతి

218చూసినవారు
విడవలూరు: 12 ఏళ్ల బాలుడు మృతి
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పరిధిలోని అలాగానిపాడు లో 12 ఏళ్ళ వయసు గల లక్ష్మీనరసింహ అనే బాలుడు అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. స్థానికంగా ఉన్న పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలుడు చిన్న వయసు నుంచే కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం కోసం రూ. లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకుండా బిడ్డను కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత పోస్ట్