నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఏదైనా సరే తమకు నచ్చిన ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగం లో ప్రతిభ కనబరిచేందుకు లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి చేయాలని సూచించారు. ఏదైనా సరే కష్టపడి చేస్తే విజయం దక్కుతుందన్నారు.