విడవలూరు: అనారోగ్యంతో బాలుడు మృతి

4చూసినవారు
విడవలూరు: అనారోగ్యంతో బాలుడు మృతి
విడవలూరు మండలంలోని అలాగానిపాడులో 12ఏళ్ల బాలుడు లక్ష్మీ నరసింహ కండరాల వ్యాధితో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలుడు చిన్ననాటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వివరించారు. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, చివరకు తమ బిడ్డను కోల్పోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్