ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్తగా మరో 107 పోస్టులు

53చూసినవారు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్తగా మరో 107 పోస్టులు
రాష్ట్రంలో 2, 260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ లను ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కొత్తగా 107 పోస్టులు రానున్నాయి. వీటిలో 44 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 63 ఎస్. జి. టి ఉన్నాయి. కాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 105 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా, గతంలో 61 పోస్టులు మాత్రమే మంజూరు చేశారు. తాజాగా మరో 44 పోస్టులు కేటాయించి డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్