కొండాయపాలెం గేటు వద్ద బాక్స్ టైప్ బ్రిడ్జి నిర్మించాలి

60చూసినవారు
కొండాయపాలెం గేటు వద్ద బాక్స్ టైప్ బ్రిడ్జి నిర్మించాలి
నెల్లూరు రూరల్ పరిధిలోని కొండాయపాలెం రైల్వే గేటు వద్ద బాక్స్ టైప్ బ్రిడ్జి నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం ఉమ్మారెడ్డి గుంటలో సీపీఎం ఆధ్వర్యంలో 'ప్రజా చైతన్య యాత్రను' ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే కొండాయపాలెం రైల్వే గేటు వద్ద బాక్స్ టైప్ బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని కోరారు.

సంబంధిత పోస్ట్