నెల్లూరు ఆర్ టి సి మెయిన్ బస్టాండులో ఒక పసిపాపని బస్టాండు ఆవరణలో తల్లి వదిలి వెళ్ళిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద వున్న పోలీసు పాయింట్ వద్ద సాయంత్రం వరకు చిన్నారిని ఉంచినా ఎవరూ రాకపోవడంతో స్థానిక ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందజేశారు. ఐసిడిఎస్ డిసిపిఓ సురేష్ చిన్నారి విషయాన్ని పీడీకి తెలియజేసి శిశు గృహ సంరక్షణలో చిన్నారిని ఉంచారు.