నెల్లూరు జిల్లాలో మరొకరికి కరోనా నిర్ధారణ

72చూసినవారు
నెల్లూరు జిల్లాలో మరొకరికి కరోనా నిర్ధారణ
నెల్లూరు జిల్లాలో శనివారం మరొకరికి కరోనా నిర్ధారణ అయింది. నగరానికి చెందిన 30 ఏళ్ల యువకుడు జ్వరం, జలుబు, గొంతు సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. అక్కడ కరోనా పరీక్ష చేయగా శుక్రవారం కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో అతనిని హోం ఐసోలేషన్ లో ఉంచారు. ఇప్పటి వరకు జిల్లాలో 12 కరోనా కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో ఎక్కడ చూసినా జ్వరాలు ఎక్కువగా ప్రబలి ఉన్నాయి.

సంబంధిత పోస్ట్