నెల్లూరు నగరంలోని హారనాధపురం సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా హారనాధ్ పురం, పినాకిని అవెన్యూ, ఆకు తోట, సర్వేపల్లి కాలువ కట్ట, చిల్డ్రన్స్ పార్క్, అయోధ్య నగర్, మధురా నగర్, అపోలో హాస్పిటల్, బలిజ పాలెం పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 8: 00 నుండి మధ్యాహ్నం 01: 00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.