నెల్లూరు నగరంలోని తెలుగుగంగ సబ్ స్టేషన్ పరిధిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. హౌసింగ్ బోర్డు, న్యూమిలిటరీ కాలనీ, ఇందిరాగాంధీనగర్, చైత్యపురి కాలనీ, సంజయ్ గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు ఉండదని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం. శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.