బీవీ నగర్ పరిధిలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

69చూసినవారు
బీవీ నగర్ పరిధిలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
నెల్లూరు బి. వి. నగర్ 33/11 సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా 11 కె. వి. సంఘమిత్ర ఫీడర్ లో మరమ్మతులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక మాగుంట లే ఔట్, లెక్చరర్స్ కాలనీ, మినీ బైపాస్ రోడ్డు, రవీంద్ర నగర్, ఉమారెడ్డి గుంట, వనంతోపు, సంఘమిత్ర స్కూల్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 01:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్