నెల్లూరు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ను ఆత్మకూరు నూతన డిఎస్పి వేణు గోపాల్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించి వారు పలు అంశాలను చర్చించారు.