78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ వారు ప్రకటించిన అవార్డులలో భాగంగా నెల్లూరు జిల్లాకు బెస్ట్ సర్కిల్ అవార్డు రావడం జరిగింది. విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. విజయన్ నేతృత్వంలో నెల్లూరు సర్కిల్ అన్ని రంగాలలో మిగతా జిల్లాల కన్నా ముందంజలో ఉన్న కారణంగా ఈ అవార్డు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది.