మెట్ట ప్రాంత అభివృద్ధికి సహకారం అందించండి

76చూసినవారు
మెట్ట ప్రాంత అభివృద్ధికి సహకారం అందించండి
మెట్ట ప్రాంత అభివృద్ధిలో సంక్షేమంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ జిల్లా కలెక్టర్ ఆనంద్ ని కలిసి విన్నవించారు. సోమవారం సాయంత్రం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలెక్టర్ ని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెనుకబడిన మెట్ట ప్రాంతానికి అవసరమైన నిధులు సమకూర్చాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్