నర్రవాడ ఆసుపత్రి తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

85చూసినవారు
నర్రవాడ ఆసుపత్రి తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు, వార్డులు, కాన్పుల గదులు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది సమాచారం తెలుసుకున్నారు. ఓపీ, కాన్పుల శాతాన్ని పెంచాలని సూచించారు. ఈ తనిఖీలో పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్