విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరచకూడదని డిమాండ్ చేస్తూ, బుధవారం నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్మిక సంఘాల నాయకులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానిని ప్రైవేట్ పరం చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే, విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేసి, గనులు కేటాయించాలని కోరారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా తొలగించడం అన్యాయమని అన్నారు.