బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని రోడ్లకు ఇరువైపులా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని నగర కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీలను తొలగించి, జరిమానా విధించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు.