కోవూరులోని పెళ్లకూరు కాలనీ మొదటి వీధిలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న సుభహాన్ కు చెందిన స్క్రాప్ ఫ్యాక్టరీలో నుంచి పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. పాత ఇనుప సామాన్లు, పనికిరాని వస్తువులు మొత్తం అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు.