స్వాతంత్ర ఉద్యమంతో పాటు సమాజంలో పెను మార్పుల కోసం ప్రయత్నించి ప్రపంచానికి దశా, దిశా నిర్దేశించిన మహోన్నత వ్యక్తిని గాంధీజీ అని నారాయణ డెంటల్ కళాశాల హెచ్ఓడి డాక్టర్ ఎన్ కన్నన్ అన్నారు. నెల్లూరు కొండాయపాళెం నగర పాలక ప్రాథమిక పాఠశాలలో రూట్స్ స్వచ్చంద సంస్థ, పీఎంపీ అసోసియేషన్ నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాటికి నేటికి ఏనాటికి గాంధీజీ ఆశయాలే ప్రపంచానికి ఆదర్శప్రాయమన్నారు.