నెల్లూరు నగర వ్యాప్తంగా నిర్వహణలో లేని ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆదేశించారు. బుధవారం పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు హరనాధపురంలోని 4 వీధులలో డాక్టర్ బుధవారం పర్యటించారు. నిర్వహణలో లేని స్థలాలలో వర్షపు నీరు చేరిపోయి దోమలు విపరీతంగా పెరిగేందుకు ఆస్కారం ఉందని ఆరోగ్య అధికారి తెలిపారు.